పక్కా ప్లాన్‌తో.. | Finance Dealer Escape With Public Money | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తో..

Dec 12 2017 10:28 AM | Updated on Dec 12 2017 10:28 AM

Finance Dealer Escape With Public Money - Sakshi

సాక్షి, కామారెడ్డి:   ‘‘దశాబ్ద కాలంగా చిట్టీలు వేస్తున్నాడు.. నమ్మకంగా డబ్బులిస్తున్నాడు.. అతడిని నమ్మి ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టాం.. ఇలా ముంచి పారిపోతాడనుకోలేదు’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని రాంమందిర్‌ రోడ్డులో ఫైనాన్స్‌ నిర్వహిస్తూ ఇటీవల పారిపోయిన వ్యాపారికి సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ‘నట్టేట ముం చేశాడు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. ఇది జిల్లాలో సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్నవారు సదరు వ్యాపారి నిర్వహించిన ఫైనాన్స్‌ల వద్దకు పరుగులు తీశారు. సదరు వ్యాపారి తమతో ఎంతో నమ్మకంగా మెలిగాడని, ఇంత దగా చేస్తాడని అనుకోలేదని ఓ బాధితుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఖరీదైన భవనం..
ఫైనాన్స్‌లో ఉండే డబ్బంతా తన సొంతమే అన్నట్టుగా వ్యవహరించిన సదరు వ్యాపారి.. ఇటీవలే ఖరీదైన భవనం నిర్మించుకున్నాడు. పట్టణంలోని జ్ఞానదీప్‌ కాలేజీ రోడ్డులో రూ. 16 వేలకు గజం చొప్పున దా దాపు 160 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, ఆధునిక హంగులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవలే గృహప్రవేశం కూడా చేశాడు. ప్రస్తుతం ఇంటి విలువ రూ.70
లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇంటిపై కూడా బ్యాం కులో హౌసింగ్‌ లోన్‌ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇంటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు, సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో ఉండడంతో డబ్బులను సర్దుబాటు చేయడం ఇబ్బందికరంగా మారడంతోనే పారిపోయేందుకు సిద్ధమై ఉంటాడని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగానే తాను పారిపోయే రోజు వర కు కూడా ఎవరికీ అను మానం రానీయకుం డా మెదిలాడని తెలుస్తోంది. కొత్తగా ఫైనాన్స్‌ల్లో భాగ స్వామ్యం కల్పిస్తానని కొందరి వద్ద డబ్బులు కూడా తీసు కుని వెళ్లినట్టు సమాచారం.

అంతటా అదే చర్చ..
కామారెడ్డి పట్టణంలో ఫైనాన్స్‌ వ్యాపారి పరారీకి సంబంధించిన విషయం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో చాలా మందికి తెలిసింది. కొందరు వ్యాపార భాగస్వాములకు కూడా ఆయన పరారీ సంఘటన తెలియలేదు. మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఎటైనా ఊరికి వెళ్లొచ్చని భావించారు. అయితే ఫోన్లు మొత్తం స్విచ్‌ఆఫ్‌ చేసి ఉండడం, ఇంటికి, ఫైనాన్స్‌కు తాళాలేసి ఉండడంతో వారు కంగుతిన్నారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అంతటా చర్చ మొదలైంది. ఎవరెవరు ఎంతెంత మోసపోయారో లెక్కలు కట్టుకుంటున్నారు.  వ్యాపారి మోసంపై చర్చ జరుగుతోంది.

పథకం ప్రకారమే..
ఫైనాన్షియర్‌ పారిపోయిన తర్వాత మకాం పెట్టేందుకుగాను ముందుగానే ఓ పట్టణంలో ఇళ్లు మా ట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వెళ్లేముందు కామారెడ్డి పట్టణంలో ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లి రెండు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడని తెలిసినవారు చెబుతున్నారు. అలాగే బియ్యం షాపునకు వెళ్లి బియ్యం కొన్నాడని, వాటిని ఎక్కడైతే మకాం పెట్టాలనుకున్నాడో అక్కడికి తరలించాడని తెలుస్తోంది.

మూడు జిల్లాలవారు..
పారిపోయిన ఫైనాన్షియర్‌ నిర్వహిస్తున్న ఫైనాన్స్‌లలో కా మారెడ్డితోపాటు సిరిసిల్ల, నిజా మాబాద్‌ జిల్లాలకు చెందిన వారు భాగస్వాములుగా ఉన్నారు. ఐదు గ్రూపుల్లో దాదాపు వంద మం ది భాగస్వాములు ఉన్నారని సమాచారం. అందులో సదరు ఫైనాన్షియర్‌ రక్తసంబంధీకులు, బంధువులు, స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. ఓ రిటైర్డ్‌ టీచర్‌ రూ. 6 లక్షలు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ చిరు వ్యాపారి తాను కష్టపడి జమ చేసుకున్న రూ.2 లక్షలు, మరో వ్యాపా రి రూ.4 లక్షలు, ఇంకో వ్యాపారి రూ. 17.50 లక్షలు, మరొకరు రూ.6.50 లక్షలు ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఇంకో వ్యాపారి రూ. 10 లక్షలు, ఓ రైతు నెల క్రితమే ఒక షేర్‌ కింద రూ.2 లక్షలు పెట్టారు. ఇలా దాదాపు వంద మందికిపైగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్‌లో భాగస్వామ్యం, చిట్టీలకు సంబంధించి దాదాపు రూ. 2.50 కోట్ల దాకా పెట్టు బడులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement