పుట్టింటికివచ్చిన కుమార్తెపై తండ్రి లైంగిక దాడి | Father Molestation on Daughter in Ponnur Krishna | Sakshi
Sakshi News home page

కుమార్తెపై తండ్రి లైంగిక దాడి

Feb 8 2020 12:56 PM | Updated on Feb 8 2020 12:56 PM

Father Molestation on Daughter in Ponnur Krishna - Sakshi

చేబ్రోలు(పొన్నూరు): కంటి పాపలా కాపాడుకోవాల్సిన తండ్రే కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చేబ్రోలు మండలం మంచాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మంచాలకు చెందిన యాకసిరి రామారావు భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఉన్న ఒక్క కూతురికి వివాహం చేశాడు. ఆమె కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఒంటరిగా ఉన్న తనపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడినట్లు శుక్రవారం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన చేబ్రోలు ఎస్‌ఐ సీహెచ్‌ కిషోర్‌ నిందితుడు రామారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement