దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసు | Sakshi
Sakshi News home page

దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు

Published Sat, Dec 28 2019 10:55 AM

ED Files Money Laundering Case On ESI Former Director Devikarani - Sakshi

సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసును ఈడీ నమోదు చేసింది. ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌లో నిందితురాలైన దేవికారాణి విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా పక్కా ఆధారాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఉచ్చు బిగించింది. ఏసీబీ వద్ద ఉన్న ఆస్తుల చిట్టా ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆమె పై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈడీ-ఐటీకి ఏసీబీ అధికారులు పూర్తి సమాచారం అందించారు.
(చదవండి: దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల)
(చదవండి: దేవికారాణి.. కరోడ్‌పతి)

Advertisement
Advertisement