మద్యం బాబులకు జైలు, జరిమానా | In The Drunk And Drive Case Jail, Fine | Sakshi
Sakshi News home page

మద్యం బాబులకు జైలు, జరిమానా

Jun 15 2018 10:36 AM | Updated on Oct 2 2018 4:34 PM

In The Drunk And Drive Case Jail, Fine - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గజ్వేల్‌రూరల్‌ : మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు, మరో ఇద్దరికి జరిమానా విధిస్తూ గజ్వేల్‌ మున్సిఫ్‌ కోర్టు జడ్జి రవీందర్‌ సత్తు తీర్పునిచ్చినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ నర్సింహారావు గురువారం తెలిపారు.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా వద్ద రెండ్రోజుల క్రితం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా... నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా గుర్తించామన్నారు.

వీరిని గజ్వేల్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. ప్రజ్ఞాపూర్‌కు చెందిన అశోక్‌కు మూడు రోజుల జైలు, చౌదర్‌పల్లికి చెందిన అయ్యలంకు ఒక రోజు జైలు శిక్ష, బెజుగామకు చెందిన నర్సింలుకు రూ. 1500, చౌదర్‌పల్లికి చెందిన బీరయ్యకు రూ. 1500 జరిమానా విధించారని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement