విద్యార్థుల బరితెగింపు.. రంగంలోకి పోలీసులు | Delhi Schoolboy Detained Over Chatroom Talked About Molestation | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ సభ్యుడు

May 5 2020 11:09 AM | Updated on May 5 2020 11:09 AM

Delhi Schoolboy Detained Over Chatroom Talked About Molestation - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ:  సోషల్‌ మీడియాలో అశ్లీల ఫొటోలు షేర్‌ చేసిన ఓ విద్యార్థిని ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరికొంత మంది ఆకతాయిలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ‘‘బాయ్స్‌ లాకర్‌ రూం’’ పేరిట కొంతమంది యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్‌ క్రియేట్‌ చేసి.. అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. అంతేగాక తమ తోటి విద్యార్థినుల ఫొటోలు మార్ఫ్‌ చేసి.. వారి గురించి అశ్లీల సంభాషణకు తెరతీశారు. ఈ విషయాన్ని అదే స్కూలుకు చెందిన ఓ బాలిక గుర్తించి.. ట్విటర్‌ వేదికగా వారి బాగోతాన్ని బహిర్గతం చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్‌ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. సదరు యువకులపై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ చేశారు.(అశ్లీల ఫొటోలు షేర్‌ చేసి.. విపరీత వ్యాఖ్యలు)

ఈ క్రమంలో #BoysLockerRoom హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే విషయం తెలుసుకున్న సదరు గ్రూపు సభ్యులు.. తమ వివరాలను వెల్లడించిన బాలిక, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో బాయ్స్‌ లాకర్‌ రూం చాట్‌ గ్రూప్‌లో ఉన్న ఓ స్కూలు విద్యార్థిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని... అతడి ఫోన్‌ను సీజ్‌ చేశామని వెల్లడించారు. ఈ గ్రూపులో యాక్టివ్‌గా ఉన్న మరో 20 మంది విద్యార్థులను కూడా విచారిస్తామని తెలిపారు. (స్నేహితుడి ఫేస్‌బుక్‌ ఐడీ హ్యాక్‌ చేసి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement