మహిళా డాక్టర్‌కు బస్సులో లైంగిక వేధింపులు | Conductor Harassment on Lady Doctor in Tamil Nadu | Sakshi
Sakshi News home page

మహిళా డాక్టర్‌కు లైంగిక వేధింపులు

Oct 3 2019 7:56 AM | Updated on Oct 3 2019 7:56 AM

Conductor Harassment on Lady Doctor in Tamil Nadu - Sakshi

చెన్నై,టీ.నగర్‌: ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కండక్టర్‌ పోలీసుల సమక్షంలో ఆమె కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. చెన్నై పెరంబూరుకు చెందిన 28 ఏళ్ల మహిళ సిద్ధ వైద్యురాలు. వల్లలార్‌ మండ్రంతో కలిసి సామాజిక సేవలు చేస్తుంటారు. ఈమె సోమవారం రాత్రి కోయంబేడు నుంచి తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడికి ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. బస్సు కండక్టర్‌గా రామనాథపురం జిల్లా ముదుగళత్తూరుకు చెందిన రాజు (32), డ్రైవర్‌ గణేశమూర్తి ఉన్నారు. బస్సులో మహిళా డాక్టర్‌ నిద్రిస్తుండగా ఆమెకు కండక్టర్‌ లైంగిక వేధింపులు జరిపాడు. దీంతో ఆమె కేకలు వేసింది. ఇలావుండగా బుధవారం తెల్లవారుజామున బస్సు కుంభకోణం చేరుకుంది. దీంతో ఆమె అక్కడున్న పోలీసు ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ విషయం తెలుసుకున్న అక్కడి బస్సు డ్రైవర్లు, కండక్టర్లు రాజు వద్ద క్షమాపణ చెప్పిస్తామని తెలిపారు. దీంతో కండక్టర్‌ రాజు ఆమె కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. అయినప్పటికీ మహిళ మనసు మారలేదు. దీంతో ఆగ్రహించిన రాజు ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె మళ్లీ కుంభకోణం వెస్ట్‌ పోలీసు స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement