చెన్నై టెక్కీకి మరణశిక్ష ; సమర్ధించిన హైకోర్టు

Chennai Techie Sentenced To Death In Minor Rape And Murder Case - Sakshi

చెన్నై : మైనర్‌పై అత్యాచారానికి, హత్యకు పాల్పడ్డ ఓ టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్‌ హైకోర్టు సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్‌కు మరణ శిక్ష సరైనదే అంటూ మంగళవారం తీర్పు వెలువరించింది. చెన్నై సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న దశ్వంత్‌.. గతేడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశగా చూపి ఇంటికి పిలిచి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు.

ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన లోకల్‌ కోర్టు దశ్వంత్‌కు మరణశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతను మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు లోకల్‌ కోర్టు తీర్పును సమర్ధించింది.

తల్లిని చంపిన కేసు కూడా..
లోకల్‌ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతునప్పుడు.. గతేడాది డిసెంబర్‌లో దశ్వంత్‌ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతడు తన తల్లి సరళ చంపి ఆమె ఆభరణాలతో ముంబై పారిపోయాడు. చివరకు అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై తరలించారు. ఇంకా సరళ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top