కర్నూలులో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ | cheddi gang halchal at Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

Jan 21 2018 3:42 PM | Updated on Jan 21 2018 3:42 PM

కర్నూలు: కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్‌చల్‌ చేసింది. హైదరాబాద్ తరహాలో దోపిడీలకు తెగబడింది. స్థానిక న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్‌లలో చోరీలకు పాల్పడింది. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు పెట్టారు. నాలుగో ఇంట్లో చోరీకి వెళ్లడంతో స్థానికులు గుర్తించారు. బనియన్, చెడ్డీలు వేసుకున్న 25 ఏళ్ల యువకులు ఈ ముఠాలో ఉన్నట్టు వారు చెబుతున్నారు. స్థానికులు గుర్తించడంతో దొంగలు పరారయ్యారు. మగ్మములు, మహమ్మద్ ఇళ్లలో చోరీ జరిగింది. అయితే పోయిన సొమ్ము ఎంతనేది తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement