నేరస్తుల కట్టడికే కార్డన్‌ సెర్‌ | cardon search is purpose of reduce crimes only | Sakshi
Sakshi News home page

నేరస్తుల కట్టడికే కార్డన్‌ సెర్‌

Mar 1 2018 10:19 AM | Updated on Mar 1 2018 10:19 AM

cardon search is purpose of reduce crimes only - Sakshi

పహాడీ నగర్‌ వద్ద పోలీసుల బందోబస్తు

భువనగిరిఅర్బన్‌ : నేరస్తులను కట్టడి చేసేందుకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  పట్టణంలోని తాతానగర్, పహాడీనగర్‌ కాలనీల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌లు, నాలుగు కార్లు, ఐదు ఆటోలను సీజ్‌ చేశారు. అలాగే ముగ్గురు రౌడిషీటర్లు, మరో ముగ్గురు అనుమానితులు, ఇద్దరు ఎక్స్‌కాన్వెర్స్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అనుమతులు లేకుండా బెల్టుషాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్యాస్‌ సిలిండర్లను సీజ్‌ చేశారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ కోరారు. కాగా, తెల్లవారుజామునే పోలీసులు తనిఖీ చేపట్టడంతో ప్రజలు ఒకింత భయాందోళన చెందారు. కార్డన్‌సర్చ్‌లో భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ రమేష్, 6 మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 130 మంది కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు.


సీజ్‌ చేసిన వాహనాలు


ధృవపత్రాలను పరిశీలిస్తున్న డీసీపీ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement