పబ్లిక్‌ టాయ్‌లెట్‌ గోడపై యువతి సెల్‌ నంబర్‌ | Cab Driver Writes Woman Mobile Number In Public Toilet | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు..

Jul 19 2018 7:57 PM | Updated on Sep 4 2018 5:53 PM

Cab Driver Writes Woman Mobile Number In Public Toilet - Sakshi

ఆమె సెల్‌ఫోన్‌ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్‌ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): క్యాబ్‌ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్‌ టాయ్‌లెట్‌ గోడపై రాసి వేధింపులకు కారణమైన డ్రైవర్‌ను సైబరాబాద్‌ షీ బృందాలు అరెస్టు చేశాయి. ఓ మహిళ కోకాపేట్‌ నుంచి మాదాపూర్‌కు క్యాబ్‌ బుక్‌ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్‌ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్‌ ఆమె సెల్‌ఫోన్‌ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్‌ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. దీంతో బాధితురాలు డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను నేరం అంగీకరించాడు.

కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్‌ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్‌ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. గత రెండు వారాల్లో 47 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశాయి. సైబరాబాద్‌ షీ టీమ్‌ ఇన్‌చార్జ్‌ అనసూయ ఈవ్‌టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement