
ఎల్లమ్మ , రామచంద్రయ్య (ఫైల్)
చిత్తూరు, కలకడ : గంట వ్యవధిలోనే అక్క, తమ్ముడు మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి కలకడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లె గొల్లపల్లెకు చెందిన కుర్రా రామచంద్రయ్య(77) వైఎస్సార్ జిల్లా పులివెందుల్లో సర్వే అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. స్వగ్రామం గొల్లపల్లెలో ఉన్నారు. అతడి అక్క ఎల్లమ్మ (80)వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లెలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎల్లమ్మ మృతి చెందింది. ఒంటి గంట సమయంలో రామచంద్రయ్య మృతిచెందారు.కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న అక్క, తమ్ముడు ఒకే రోజు రాత్రి ఒకరి తరువాత ఇంకొకరు మరణించడం గమనార్హం. మృతుడు రామచంద్రయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.