బైక్‌ కొనివ్వలేదని బలవన్మరణం | Boy Commits Suicide After Father Refuse To Buy Him A Bike In Bhikkanuru | Sakshi
Sakshi News home page

బైక్‌ కొనివ్వలేదని బలవన్మరణం

Nov 6 2019 9:15 AM | Updated on Nov 6 2019 9:15 AM

Boy Commits Suicide After Father Refuse To Buy Him A Bike In Bhikkanuru - Sakshi

సాక్షి, భిక్కనూరు: ఎన్నిసార్లు అడిగినా తండ్రి బైక్‌ కొనివ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.   ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. జంగంపల్లి గ్రామానికి చెందిన లింగం, నర్సవ్వ దంపతులు కుమారుడు అనిల్‌ (23). తనకు పల్సర్‌ బైక్‌ కొనివ్వమని అనిల్‌ కొన్ని నెలలుగా తన తండ్రిని కోరుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూ తండ్రి వాయిదా వేస్తు వచ్చాడు. ఈ విషయమై సోమవారం అనిల్‌ తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం సోమవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నానని చెప్పిన అనిల్‌ అక్కడికి వెళ్లి పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement