సెక్స్‌ రాకెట్‌; ప్రొడక్షన్‌ మేనేజర్‌ అరెస్ట్‌ | Bollywood Production Manager Held in Immoral Traffic | Sakshi
Sakshi News home page

సెక్స్‌ రాకెట్‌; ముగ్గురు మహిళలకు విముక్తి

Jan 4 2020 8:19 PM | Updated on Jan 4 2020 8:20 PM

Bollywood Production Manager Held in Immoral Traffic - Sakshi

లాల్‌ సహకారంతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా అనే మహిళ ఈ రాకెట్‌ను నడిపిస్తోందని పోలీసులు వెల్లడించారు.

ముంబై: సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఒకరిని అరెస్ట్‌ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. జుహు సబర్బన్‌లోని జెడ్‌ లగ్జరీ రెసిడెన్సీ హోటల్‌పై సోషల్‌ సర్వీస్‌(ఎస్‌ఎస్‌) అధికారులు దాడి చేసి బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ రాజేశ్‌ కుమార్‌ లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్‌ నుంచి ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను కాపాడారు.

లాల్‌ సహకారంతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా అనే మహిళ ఈ రాకెట్‌ను నడిపిస్తోందని పోలీసులు వెల్లడించారు. విదేశాల నుంచి మహిళలను ముంబైలోని స్టార్‌ హోటల్స్‌కు పంపిస్తూ ఒక్కొక్క కస్టమర్‌ నుంచి రూ.80 వేలకు వసూలు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద లాల్‌పై కేసు నమోదు చేశారు. జరీనాను ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement