బెంగళూరులో యువతుల వీరంగం

Bangalore Youth Drunk And Drive in Lockdown time - Sakshi

కర్ణాటక,యశవంతపుర: లాక్‌డౌన్‌ సమయంలో పీకాలదాక తాగిన యువతులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులపై వాహనాన్ని దూకించే యత్నించారు.  ఈఘటన బెంగళూరులో జరిగింది. లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు నగరంలో అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.  శనివారం సాయంత్రం నలుగురు యువతులు మద్యం సేవించి కారులో ప్రయాణిస్తూ లీలా ప్యాలెస్‌ సమీపంలో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు వాహనాన్ని నిలిపి  తనిఖీ చేస్తుండగా తమ వద్ద పాస్‌ ఉందని, మాకు ఉన్నతాధికారులు తెలుసంటూ యువతులు వాదనకు దిగారు.

మద్యం తాగినట్లు అనుమానం రావడంతో బ్రీతింగ్‌ అనలైజర్‌తో తనిఖీ చేయడానికి యత్నించగా యువతులు  పోలీసులపైకి వాహనాన్ని దూకించే యత్నం చేసి ఉడాయించారు. పోలీసులు బైక్‌పై కిలోమీటర్‌ దూరం వరకు వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. యువతులు అత్యంత వేగంగా ప్రయాణించి తప్పించుకున్నారు. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top