ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

AAP MLA Manoj Kumar To Three Months In Jail - Sakshi

న్యూఢిల్లీ : ఆప్‌ ఎమ్మెల్యే మనోజ్‌ కుమార్‌కు ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది. 2013 అసెంబ్లీ ఎన్నిక సమయంలో తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని కళ్యాణ్‌పురిలోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అతనికి మూడు నెలల శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే ఆ తర్వాత మనోజ్‌ కుమార్‌కు బెయిల్‌ లభించింది. అడిషినల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌ అతనికి పదివేల రూపాలయల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పిల్ చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే అభియోగాలతో ఐపీసీ సెక్షన్ 189 కింద, పోలింగ్ స్టేషన్ వద్ద అల్లర్లు సృష్టించారనే ఆరోపణలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 131 కింద మనోజ్‌ కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్‌ 11 అతన్ని దోషిగా తేల్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top