యోగా కోసం వెళితే.. శృంగారం చేయాలని.. | 3 Yoga Teachers Arrested For Molesting Chinese Woman | Sakshi
Sakshi News home page

జపాన్‌‌ మహిళకు యోగా గురువుల వేధింపులు 

May 11 2020 1:13 PM | Updated on May 11 2020 2:30 PM

3 Yoga Teachers Arrested For Molesting Chinese Woman - Sakshi

డెహ్రాడూన్‌ : యోగా నేర్చుకోవటానికి వచ్చిన ఓ జపాన్‌‌ మహిళపై లైగింక వేధింపులకు పాల్పడి జైలు పాలయ్యారు ముగ్గురు యోగా గురువులు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జపాన్‌కు చెందిన మహిళ రిషీకేశ్‌లో ఉంటూ అక్కడి ఆమ్‌బాగ్‌ ఏరియాలోని యోగా స్కూల్లో యోగా నేర్చుకుంటోంది. యోగా స్కూల్లో పనిచేస్తున్న ముగ్గురు గురువులు హరిక్రిష్ణ, చంద్రకాంత్‌, సోమ్‌రాజ్‌లు ఆమెపై కన్నేశారు. తరచు ఆమెను లైంగికంగా వేధించేవారు. తమతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చేవారు. దీంతో విసుగు చెందిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. శనివారం ముని కీ రేతి పోలీస్‌ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఆదివారం నాడు వారి స్వగృహాలలో అదుపులోకి తీసుకున్నారు.

చదవండి : ఓరిస్, చెట్నీస్‌ రెస్టారెంట్స్‌ పేరుతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement