
ప్రతీకాత్మక చిత్రం
జకార్తా : ఇండోనేషియా ఏస్ ప్రావిన్స్‌లోని సుమత్రా దీవుల్లో గల ఆయిల్ బావిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా..40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో ఐదు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆయిల్ బావిలో ఏర్పడి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఇండోనేషియన్ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ టీంను హుటాహుటిన నియమించింది.