breaking news
Oil wells
-
చమురు బావిలో మరోసారి భారీ ప్రమాదం
గువాహటి : అసోంలో దాదాపు రెండు నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న చమురుబావిలో బుధవారం మరోమారు ప్రమాదం చోటుచేసుకుంది. తిన్సుకియా జిల్లా బాఘ్జాన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా కంపెనీకి చెందిన ఐదోనెంబర్ చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడానికి వచ్చిన ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.(ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా) కాగా, తొలుత మే 27న చమురు బావి నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో అరికట్టడానికి విదేశాల నుంచి నిపుణులను తెప్పించారు. అయితే జూన్9న గ్యాస్‌లీక్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ఐదో నెంబర్ బావి నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. నాటి నుంచి మంటలను అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో ఇప్పటికే ఇద్దరు అగ్రిమాక సిబ్బంది మృతిచెందారు. (అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్ ఠాక్రే సెటైర్లు) తాజాగా జరిగిన ప్రమాదంలో వీదేశీ నిపుణులకు గాయాలయ్యాయి. మంటలను ఆర్పే బ్లో అవుట్ ప్రివెంటర్‌ను చమురు బావి వద్ద పెట్టడానికి కంటే ముందు బావి స్పూల్ తెరవడానికి వెళుతుండగా మంటలు చెలరేగాయి. తాజా ఘటనతో మంటలను అదుపు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. -
ఆయిల్ బావిలో అగ్నిప్రమాదం..11 మంది మృతి
జకార్తా : ఇండోనేషియా ఏస్ ప్రావిన్స్‌లోని సుమత్రా దీవుల్లో గల ఆయిల్ బావిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా..40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో ఐదు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆయిల్ బావిలో ఏర్పడి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఇండోనేషియన్ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ టీంను హుటాహుటిన నియమించింది. -
నాగాయలంకలో చమురు బావుల గుర్తింపు
రాజమండ్రి(తూ.గో.జిల్లా): కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా జిల్లా నాగాయలంకలో చమురు బావులను ఓఎన్జీసీ తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ రాజమండ్రి అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దేబశీష్ సన్యాల్ మంగళవారం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రెండు హై జనరేషన్ బావుల్లో తొలి దశ డ్రిల్లింగ్ ఆరంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బావుల ద్వారా రోజుకు 10 వేల బేరళ్ల చమురు, ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని అంచనా వేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎఫ్డీపీ) పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. అక్కడ నుంచి అనుమతి రాగానే తొలి దశలో రెండు, రెండో దశలో 18 బావులను ప్రారంభిస్తామన్నారు. తొలి దశ బావులను ఎన్జెడ్-1ఎస్టీ, ఎస్ఈ-1 బావులుగా నామకరణం చేశామని సన్యాల్ వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట, మల్లేశ్వరం బావులను విస్తరించనున్నామని వివరించారు. గత ఏడాది జరిగిన నగరం గ్యాస్ పైపులైను పేలుడువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఓఎన్జీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. గ్యాస్‌తోపాటు నీరు, ఇతర పదార్థాలు వెళ్లడంవల్ల పైప్లైన్లు దెబ్బతింటున్నాయని గుర్తించిన తమ సంస్థ, దీని నివారణకు ఐదు ప్రాంతాల్లో గ్యాస్ డీహైడ్రేజేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనుందన్నారు. దీనివల్ల ప్యూరిఫైడ్ గ్యాస్ రవాణా జరుగుతుందని, పైపులైన్లు త్వరగా దెబ్బతినవని సన్యాల్ తెలిపారు. ఇందుకు రూ.320 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పైపులైన్ల నిర్మాణ పనులను ఓఎన్జీసీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టాయని, థర్డ్ పార్టీగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఉందని చెప్పారు. కేజీ బేసిన్ పరిధిలో 800 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయన్నారు. వీటిలో 4, 6 అంగుళాల పైపులైన్లు మారుస్తున్నామన్నారు. ఇప్పటికే 25 శాతం మార్పులు చేశామని చెప్పారు. ప్రపంచంలో చమురు, గ్యాస్ ఉత్పత్తుల వెలికితీతలో ఓఎన్జీసీ మూడో స్థానంలో నిలిచిందని వివరించారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఆర్ఎఫ్) కోసం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ సైన్స్ ఆయా గ్రామాల్లో సర్వే చేపట్టిందని, ఓఎన్జీసీ సీఎండీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందజేసిందని, దీని ప్రకారం సీఆర్ఎఫ్ నిధులు ఖర్చు చేస్తామని సన్యాల్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో జనరల్ మేనేజర్ శర్మ కూడా పాల్గొన్నారు.