పాక్‌ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్‌ అడ్వైజ్‌ ఇదే!

Pak PM Imran khan Motivates Pakisthan cricketers To Win The Match - Sakshi

సాక్షి: క్రికెట్‌ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తున్న భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌​ఖాన్‌ తమ జట్టులో ప్రేరణనింపే ప్రయత్నం చేశారు. పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తన నాయకత్వ ప్రతిభతో జట్టును ముందుండి విజయతీరాలకు నడిపిస్తాడని ఇమ్రాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు గురించి అతిగా ఆలోచించకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ఫోకస్‌ చేయాలని జట్టు సభ్యులకు ఆయన సూచించారు. 

పాక్‌ సారథిగా‌ 1992 ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్‌​ఖాన్‌ తన వ్యక్తిగత అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘నా కెరీర్‌ ప్రారంభంలో 70శాతం ప్రతిభ, 30శాతం మానసిక బలంతో నేను విజయం సాధించానని భావించాను. కానీ కెరీర్‌ పూర్తయిన తరువాత ఇది 50-50 శాతం అనుకున్నాను. కానీ, 60శాతం మానసిక బలం, 40శాతం ప్రతిభతో రాణించినట్టు నా మిత్రుడు గవాస్కర్‌ చెప్పాడు. దానితో నేను ఏకీభవిస్తాను’ అని పేర్కొన్నారు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్‌ ఆడతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో క​చ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.

Read latest Cricket News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top