‘యస్‌’ సంక్షోభం : రాణా కపూర్‌కు లుక్‌ అవుట్‌ నోటీసు

Yes Bank crisis: ED issues look out notice against Rana Kapoor - Sakshi

సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మాజీ సీఎండీ రాణా కపూర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన ఇంట్లో శుక్రవారం రాత్రి  సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్‌ ఔట్‌  నోటీసు జారీ చేసింది.  రాణాకపూర్‌ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ  అధికారి ఒకరు చెప్పారు.  కాగా 2015లో 80 నకిలీ సంస్థలకు రూ. 12,733 కోట్లు నిధులను మళ్లించినట్టు ఆరోపణలు  వెలువెత్తాయి.

అలాగే దివాలా కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ (దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) కు భారీ ఎత్తున నిధులను మళ్లించబడినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. దీనికి బదులుగా భారీ ఎత్తున నగదు రాణా కపూర్‌ భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఈ రుణాల స్వభావాన్ని, వాటి మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారిస్తున్నట్టు చెప్పారు. యస్‌ బ్యాంకు సంక్షోభంపై ఆర్‌బీఐ రంగంలోకి దిగిన అనంతరం ఈడీ విచారణను వేగంతం చేసింది. మరోవైపు యస్‌బ్యాంకును స్వాధీనంలోకి చేసుకున్న ఆర్‌బీఐ 30 రోజులపాటు మారటోరియం విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అలాగే  పునర్మిర్మాణ ప్రణాళికలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top