లాక్‌డౌన్‌ సడలింపు : పసిడి వెలవెల

Yellow metal falls below Rs 45500 per 10 grams   - Sakshi

లాక్‌డౌన్‌ పరిమితులు సడలింపులతో దిగొస్తున్న పుత్తడి

ఫ్యూచర్స్ లో 10 గ్రా. బంగారం ధర రూ. 45500 దిగువకు 

సాక్షి, ముంబై: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ పరిమితుల సడలింపుతో  పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో  బంగారం ధర మంగళవారం  కీలక మద్దతు స్థాయికి దిగువన ట్రేడ్ అవుతోంది.  ప్రారంభంలో రూ .45,527 పలికిన  జూన్ డెలివరీ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 0.71 శాతం తగ్గి 45,480 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు రూ.45,807 లు పలికిన కిలో వెండి ధర కూడా పడింది.  ఫ్యూచర్స్  రూ .41,244 తో పోలిస్తే 0.24 శాతం తగ్గి  కిలో ధర రూ .41,143 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్  మార్కెట్లో  22  క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 43760 గా వుంది.  24 క్యారెట్ల  పది గ్రాముల బంగారం ధర రూ.46560 వద్ద  కొనసాగుతున్నాయి. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ )

అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చింది. కరోనా వైరస్ ఆంక్షలను సడలించడం ద్వారా మార్కెట్లలో సెంటిమెంట్  బలడి పెట్టుబడులు ఈక్విటీల  వైపు మళ్లాయి. దీంతో మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి. స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి ఔన్సు ధర 1699.56 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి ఔన్సుకు 1705.50 డాలర్ల వద్ద వుంది. అయితే అమెరికా, చైనా మధ్య ముదుతున్న ట్రేడ్ వార్ భయాలు అటు ట్రేడర్లను, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెడుతున్నాయి. దీంతో బంగారం  ఔన్స్ ధర 1700 డాలర్లకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top