యమహా ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్ | Yamaha launches Cygnus Alpha with disc brake | Sakshi
Sakshi News home page

యమహా ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్

Jun 15 2016 12:49 AM | Updated on Sep 4 2017 2:28 AM

యమహా ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్

యమహా ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్

ప్రముఖ టూవీలర్ కంపెనీ ‘యమహా మోటార్’ తన స్కూటర్ ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ధర రూ.52,556

 న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ ‘యమహా మోటార్’ తన స్కూటర్ ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52,556 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. గత కొన్నేళ్లుగా స్కూటర్ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోందని, అందుకే ఆ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని యమహా మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ తెలిపారు. ఈ ఏడాది చివరకు స్కూటర్ మార్కెట్‌లో 10 శాతం మార్కెట్ వాటాను సాధించడం లక్ష్యమని చె ప్పారు. అదనపు భద్రతా ఫీచర్లను కోరుకుంటున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement