తొలి సేల్‌కు వస్తున్న ఎంఐ ఏ2

Xiaomi Mi A2 First Sale On Mi.com, Amazon From 12PM, August 16 - Sakshi

షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ ఏ2 తొలి సేల్‌కు వస్తోంది. ఆగస్టు 16న అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్లు, అమెజాన్‌ ఇండియాలో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఎంఐ ఏ2 ధర భారత్‌లో 16,999 రూపాయలుగా ఉంది. ఈ వెబ్‌సైట్లలో ఎంఐ ఏ2ను పలు లాంచ్‌ ఆఫర్లతో లిస్ట్‌ చేశాయి. ఆగస్టులో ఈ ఫోన్‌ లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌లోనే భారత్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ను తర్వాత మార్కెట్‌లోకి తీసుకురానుంది.
ఆ తర్వాత ఆఫ్‌లైన్‌గా, ఇతర రిటైల్‌ స్టోర్లలో కూడా ఎంఐ ఏ2 అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. 

లాంచ్‌ ఆఫర్లు...
ఎంఐ ఏ2 కొనుగోలుదారులకు 2,200 రూపాయల ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌, 4.5టీబీ వరకు డేటాను రిలయన్స్‌ జియో ఆఫర్‌ చేయనుంది. ఎంఐ ఎక్స్చేంజ్‌ ప్రొగ్రామ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌లో తక్కువ ధరలో ఈ కొత్త డివైజ్‌ను యూజ్లు పొందవచ్చు. 999 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఎంఐ ప్రొటెక్ట్‌ ప్లాన్లు, ఎంఐ ఏ2కు అందుబాటులో ఉంటాయి.  

ఎంఐ ఏ 2 ఫీచర్లు...
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 18:9 రేషియో,
క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్‌
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5 లేయర్‌
ఆర్క్‌ డిజైన్‌తో అల్యూమినియం యూనిబాడీ
ఆండ్రాయిడ్ వన్‌
4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌
12+20 ఎంపి డ్యుయల్‌ రియర్‌ కెమెరా
20ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3010ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top