షావోమి ఎంఐ ఏ1 ఇక దొరకదు..!

Xiaomi Mi A1 Discontinued In India - Sakshi

చైనీస్‌ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమి అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌. కంపెనీకి చెందిన తొలి ఆండ్రాయిడ్‌ వన్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ ఏ1 ఇక నుంచి భారత్‌లో లభ్యం కాదట. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇక నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కానీ కంపెనీ అధికారిక సెల్లింగ్‌ పార్టనర్‌ వద్ద కానీ అమ్మకానికి లభ్యం కాదని కంపెనీ తన భారత వెబ్‌సైట్‌లో పేర్కొంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఈ ఏడాది ప్రారంభంలోనే ఓరియో అప్‌డేట్ తీసుకొచ్చింది.

ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్లోనే లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు లాంచ్‌చేసిన ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఏడు నెలల్లోనే నిలిపివేయలేదు. వచ్చే కొన్ని రోజుల్లో ఎంఐ ఏ1కు సక్సెసర్‌గా ఎంఐ ఏ2 లాంచ్‌ చేయనున్న నేపథ్యంలో షావోమి ఈ ఫోన్‌ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు టెక్‌ విశ్లేషకులంటున్నారు. ఎంఐ 6ఎక్స్‌ అక్కా ఎంఐ ఏ2 చైనాలో ఈ నెల 25న లాంచ్‌ కాబోతోంది. అయితే కంపెనీ అధికారిక ఆహ్వానంలో మాత్రం ఎంఐ 6ఎక్స్‌ గురించి ధృవీకరించలేదు. కొంత మంది టెక్‌ విశ్లేషకులు ఏప్రిల్‌ 25న ఎంఐ 5ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తుందని అంటున్నారు.

లీకైన సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 25న లాంచ్‌ కాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌కు ఫీచర్లు ఈ కింది విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
 4జీబీ ర్యామ్‌, 32జీబీ వెర్షన్‌
 6జీబీ ర్యామ్‌, 64జీబీ వెర్షన్
6జీబీ ర్యామ్‌, 128జీబీ మోడల్‌
స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
12మెగాపిక్సెల్‌, 20మెగాపిక్సెల్‌తో బ్యాక్‌ కెమెరాలు
20మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

అమ్మకాలు నిలిపివేస్తున్న ఎంఐ ఏ1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.
5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌ 
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
12 మెగాపిక్సెల్‌, 12 మెగాపిక్సెల్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర 14,999 రూపాయలు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top