షావోమి స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌ ప్రొగ్రామ్‌ | Xiaomi Announces 'Mi Exchange Program' For Mi Homes | Sakshi
Sakshi News home page

షావోమి స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌ ప్రొగ్రామ్‌

Nov 22 2017 6:21 PM | Updated on Nov 22 2017 6:21 PM

Xiaomi Announces 'Mi Exchange Program' For Mi Homes - Sakshi

షావోమి ఎంఐ ఎక్స్చేంజ్‌ ప్రొగ్రామ్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. ఢిల్లీకి చెందిన క్యాషిఫై సంస్థతో కలిసి, ఈ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. దీని కింద కొత్త షావోమి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు, తమ పాత హ్యాండ్‌సెట్లతో ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్చేంజ్‌ చేసుకునే క్రమంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ లభిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌ విలువను క్యాషిఫై టీమే నిర్ణయించనుంది. ఆ విలువ మేర కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ధర కూడా తగ్గుతుంది. ఎంఐ ఎక్స్చేంజ్‌ ప్రొగ్రామ్‌ కింద పాత ఫోన్‌ రిటర్నులో కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారు, దగ్గర్లోని ఎంఐ హోమ్‌ స్టోర్‌కు విచ్చేయాల్సి ఉంటుంది.

ఎంఐ హోమ్‌ స్టోర్‌లో మొత్తం నగదును చెల్లించి కొత్త ఫోన్‌ను కొనుగోలుచేసిన అనంతరం, పాత మోడల్‌ మొత్తాన్ని క్యాషిఫై టీమ్‌ తర్వాత చెల్లించనుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు క్యాషిఫై నుంచి పికప్‌ సర్వీసునూ ఎంచుకోవచ్చు.  దీనికోసం యూజర్‌ క్యాషిఫై వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎంఐ హోమ్‌ కేవలం ఒకే ఒక్క షావోమి స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే ఈ ఎక్స్చేంజ్‌లో అందుబాటులో ఉండనుంది. అంతేకాక ఎక్స్చేంజ్‌ చేయాలనుకునే యూనిట్‌ క్యాషిఫై పోర్టుఫోలియోలో లిస్టు అయి ఉండాలి.  2015లో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షావోమి, భారత్‌లో బలమైన పునాదులను ఏర్పరుచుకుంది. ఏడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 13 ఎంఐ హోమ్‌ అవుట్‌లెట్లను ఏర్పాటుచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement