వోల్వో కార్ల ధరలు పెంపు | Volvo Auto India to hike prices by up to 2% from April | Sakshi
Sakshi News home page

వోల్వో కార్ల ధరలు పెంపు

Mar 25 2017 1:03 AM | Updated on Sep 5 2017 6:59 AM

వోల్వో కార్ల ధరలు పెంపు

వోల్వో కార్ల ధరలు పెంపు

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ కార్ల ధరలను 2.5% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ కార్ల ధరలను 2.5% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణంగా వాహన ధరలు పెంచుతున్నామని తెలిపింది. ఈ కంపెనీ దేశీ మార్కెట్లో రూ.25.49 లక్షలు–రూ.1.25 కోట్ల ధరల శ్రేణిలో కార్లను విక్రయిస్తోంది. కాగా బీఎండబ్ల్యూ, హోండా తదితర కంపెనీలు కూడా వాహన ధరలను ఏప్రిల్‌ నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

Advertisement
 
Advertisement
Advertisement