ఫోక్స్‌వ్యాగన్‌ కొత్త వెర్షన్‌ పోలో

Volkswagen launches 1.0 lite MPI engine Polo   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వాగన్ కొత్త  వెర్షన్‌ కారును లాంచ్‌ చేసింది. తన ప్రముఖహ్యాచ్‌బ్యాక్  మోడల్‌  పోలోలో కొత్త వెర్షన్‌ను  మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1.0 లీటర్ల ఎంపీఐ ఇంజిన్‌తో  తీసుకొస్తున్న  ఈ కారుకు   రూ. 5,41,800 (ఎక్స్-షోరూమ్)  ప్రారంభ ధరగా నిర్ణయించింది.  అలాగే ఇండియాలో  1.2 ఎంపీఐ ఇంజిన్‌ను కొత్త 1.0 ఇంజిన్‌తో భర్తీ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కొత్త  పోలో లో  56 కిలోవాట్ల పపర్‌, 95 ఎన్‌ఎం టార్క్‌, లీటరుకు 18.78 కిలోమీటర్ల మైలేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  

తమ బ్రాండ్‌ను మరింత మెరుగుపరుచుకుంటూ, భారతీయ విలక్షణమైన కారు-కొనుగోలుదారులకు విభిన్న పోర్ట్‌ఫోలియోలను  అందించడమే తమ లక్ష్యమని  వోక్స్‌ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ నాప్ చెప్పారు. ఈ కొత్త వెర్షన్‌లో ఇంధన  సామర్ధ్యాన్ని మెరుగుపరిచామన్నారు.  కాగా  ఫోక్స్‌వ్యాగన్‌ దేశీయ మార్కెట్లో పోలో, వెంటో, జెట్టా, పాసట్, టౌరేగ్ వంటి  మోడల్‌ కార్లను  విక్రయిస్తుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top