వొడాఫోన్‌ సరికొత్త సూపర్‌ వీక్‌ ప్లాన్‌ | Vodafone offers unlimited Calls, 500 MB data at Rs 69 | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ సరికొత్త సూపర్‌ వీక్‌ ప్లాన్‌

Oct 26 2017 2:14 PM | Updated on Oct 26 2017 2:14 PM

Vodafone offers unlimited Calls, 500 MB data at Rs 69

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ సరికొత్త సూపర్‌వీక్‌ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.69కు ఈ ప్లాన్‌ను తన ప్రీపెయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, 500 ఎంబీ డేటాను వారం పాటు అందించనుంది. ఇది ఒక్కసారి ప్యాక్‌ కాదని, ప్రతి ఏడు రోజులకు ఒకసారి దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. బెస్ట్‌ నెట్‌వర్క్‌ను, సర్వీసు అనుభవాన్ని తాము అందిస్తున్నట్టు నమ్ముతున్నామని వొడాఫోన్‌ ఇండియా కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అవనీష్‌ ఖోస్లా తెలిపారు. 

సూపర్‌వీక్‌తో స్నేహపూర్వకమైన, సరసమైన అపరిమిత ప్లాన్‌ను ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు చెప్పారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఉచితంగా వొడాఫోన్‌ సూపర్‌నెట్‌ 4జీ అనుభవాన్ని కస్టమర్లు ఎంజాయ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ప్యాక్‌ను రిటైల్‌ అవుట్‌లెట్లు, యూఎస్‌ఎస్‌డీ, వెబ్‌సైట్‌, మైవొడాఫోన్‌ యాప్‌ ద్వారా కొనుగోలుచేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఏడాదే కంపెనీ సూపర్‌డే, సూపర్‌వీక్‌ ప్లాన్‌ను వొడాఫోన్‌ లాంచ్‌ చేసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రూ.52తో మరో సూపర్‌వీక్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనికింద అపరిమితంగా వొడాఫోన్‌ టూ వొడాఫోన్‌ కాల్స్‌ను, 250ఎంబీ 3జీ, 4జీ డేటాను అందిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement