
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థలు వినియోగదారులకు మినిమం రీచార్జ్ ప్లాన్లనుపరిచయం చేస్తున్నాయి. ఎయిర్టెల్ తరహాలో వోడాఫోన్ ఇండియా కొత్త మినిమం ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.24 ప్లాన్‌ను వొడాఫోన్ ఇండియా తీసుకొచ్చింది. ఇందులో ఖాతా కాలపరిమితి ముగిసిపోకముందే.. వొడాఫోన్‌ఐడియా ఖాతాను కొనసాగించదలుచుకున్న వినియోగదారులు కనీసం రూ.24 ప్యాక్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్లాన్ వొడాఫోన్, ఐడియా యూజర్లు ఇద్దరికీ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరకు 100 ఫ్రీ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. సెకనుకు (లోకల్ అండ్ ఎస్‌టీడీ) 2.5పైసా చార్జ్ చేస్తుంది. అయితే ఎస్‌ఎఎస్‌కు రూపాయి వసులు చేస్తుంది. మైవోడాఫోన్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. టాక్ టైం, డేటా ప్రయోజనాలకంటే.. ప్లాన్ వాలిడిటీకే కంపెనీ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది.
కాగా ఎయిర్‌టెల్, టాటా డొకోమో వంటి ఇతర టెలికాం ఆపరేటర్లు తమ కనీస రీఛార్జ్ ప్రణాళికలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.