విస్తారా ‘24–గంటల’ ఆఫర్‌ 

 Vistara offers flight tickets from Rs 999 in new sale - Sakshi

రూ.999కే విమాన ప్రయాణం

బాగ్‌డోగ్రా– గువాహటి మార్గానికే... 

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా మరోసారి పండుగల ఆఫర్‌ను ప్రకటించింది. ‘24–అవర్స్‌ ఓన్లీ’ పేరుతో అన్ని పన్నులతో కలిపి రూ.999కే విమాన ప్రయాణమని తెలిపింది. ఈ ఆఫర్‌ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్‌ క్లాస్‌లకు వర్తిస్తుందని తెలిపింది.

అయితే, ప్రారంభ టికెట్‌ ధర ఆఫర్‌ పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి గువాహటి మార్గానికి మాత్రమే పరిమితమని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 12:01 సమయానికి బుకింగ్స్‌ ప్రారంభం కాగా, డిసెంబర్‌ 27 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10 వరకు ప్రయాణాలకు ఆఫర్‌ వర్తిస్తుంది. ఇతర మార్గాలలో రూ.1,199 నుంచి రూ.2,599 టికెట్‌ ధరను ఆఫర్‌ చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top