సుల్తాన్ తో వీడియోకాన్ డీ2హెచ్ అనుబంధం | Videocon d2h & Yash Raj Films partner for Sultan in-film branding | Sakshi
Sakshi News home page

సుల్తాన్ తో వీడియోకాన్ డీ2హెచ్ అనుబంధం

Jul 7 2016 12:53 AM | Updated on Sep 4 2017 4:16 AM

సుల్తాన్ తో వీడియోకాన్ డీ2హెచ్ అనుబంధం

సుల్తాన్ తో వీడియోకాన్ డీ2హెచ్ అనుబంధం

యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో డీటీహెచ్(డెరైక్ట్ టు హోమ్) సర్వీసులందజేసే వీడియోకాన్ డీ2హెచ్ వినూత్నమైన అనుబంధం ఏర్పర్చుకుంది.

హైదరాబాద్: యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో డీటీహెచ్(డెరైక్ట్ టు హోమ్) సర్వీసులందజేసే వీడియోకాన్ డీ2హెచ్ వినూత్నమైన అనుబంధం ఏర్పర్చుకుంది. సుల్తాన్ సినిమాలో హీరోగా నటించిన సల్మాన్ ఖాన్ వీడియోకాన్ డీ2హెచ్ సంస్థ సేల్స్, సర్వీస్ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తారని వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొంది. ఈ వినూత్నమైన అనుబంధం కారణంగా భారత గ్రామీణ ప్రాంతాల్లో వీడియోకా న్ డీ2హెచ్‌కు మంచి ప్రచారం లభిస్తుందని కంపెనీ సీఈవో అనిల్ ఖేరా పేర్కొన్నారు. తమ తాజా ప్రచారం ‘ఖుషియోంకీ ఛత్రి’ కి ఈ సులా ్తన్ అనుబంధం కొనసాగింపని వివరించారు. కాగా వీడియోకాన్ డీ2హెచ్‌తో ఈ అనుబంధం సంతోషకరంగా ఉందని యశ్‌రాజ్ ఫిల్మ్స్ వైస్ ప్రెసిడెంట్ అశీష్ పాటిల్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement