ఎస్సార్‌ స్టీల్‌ ట్విస్ట్‌: రేసులో వేదాంత

Vedanta, ArcleorMittal, Numetal-JSW submit plan for Essar Steel in round 2      - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో పీకల్లోతున కూరుకుపోయి దివాలా దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ బిడ్డింగ్‌ రేసులో తాజాగా మరోదిగ్గజం చేరింది.ఇప్పటికే   అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఈ రేసులో ముందుండగా ఇపుడు  వేదాంతా వచ్చి చేరింది.  రెండవ రౌండ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియలో  ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.  ఈ బిడ్ల దాఖలుకు సోమవారమే తుది గడువు.

ఫిబ్రవరి 12నాటి  మొదటి దశలో బిడ్డింగ్‌లో ఆర్సెలార్ మిట్టల్‌,  మారిషస్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ  న్యుమెతాల్‌తో కలిసి  జెస్‌ డబ్ల్యూ రెండు సంస్థలు ప్రధానంగా నిలవగా ఇపుడు వేదాంతా దీనికోసం పోటీ పడుతున్న దిగ్గజాల సరసన చేరింది. అయితే మొదటి దశ బిడ్డింగ్‌లో ఐబిసి ​​చట్టాల ప్రకారం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం  ఈ రెండు సంస్థల బిడ‍్లను తిరస్కరించాయి. కాగా దివాలా చట్టం కింద తొలి విడతలో చర్యలు చేపట్టేందుకు రిజర్వు బ్యాంకు గుర్తించిన 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి.  గుజరాత్‌లో  ప్రధాన ఉత్పత్తి  కేంద్రం ఉన్న ఎస్సార్‌స్టీల్‌  సంవత్సరానికి 9.6 మిలియన్ టన్నుల నామమాత్రపు సామర్ధ్యం కలిగివుంది.  అయితే  భారీగా పెరిగిన ముడి ఇనుము ధరలు, ఉత్పత్తి  వ్యయాలు కంపెనీకి ప్రతిబంధకం మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top