బడ్జెట్‌లో ప్రాధాన్యతా రంగాలు | Union Budget 2020 Budget Shows Interest On Some Sectors | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో ప్రాధాన్యతా రంగాలు

Feb 1 2020 3:00 PM | Updated on Feb 1 2020 3:38 PM

Union Budget 2020 Budget Shows Interest On Some Sectors - Sakshi

న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది.

►రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పలు సంస్కరణలను చేశారు.
►2019-20 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ జీడీపీలో ద్రవ్యలోటుకు 3.3శాతం కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌ (2020-21)ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంశంలో ప్రభుత్వం సరళీకృత విధానం అవలంభించే అవకాశాలు ఉన్నట్లు బడ్జెట్‌ స్పష్టం చేస్తుంది.
►ప్రభుత్వం కాలుష్య నివారణ, డిజిటల్‌ ఇండియా, మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, నదులను శుభ్రపరచడం తదితర అంశాలకు బడ్జెట్‌ ప్రాధాన్యత ఇచ్చింది. 
►ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండించడంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు బడ్జెట్‌ స్పష్టం చేస్తుంది
►దేశం బాగుండాలంటే అందరి ఆరోగ్యాలు బాగుండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను మరింత మెరుగుపరుచే విధంగా కృషి చేసస్తామని బడ్జెట్‌ స్పష్టం చేస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా మహిళలు, శిశువులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
►బడ్జెట్‌లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, రక్షణ శాఖ, తయారీ రంగం, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, వైద్య పరికరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement