
నంబర్ వన్ వాహన కంపెనీగా టయోటా
ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీగా జపాన్‌కు చెందిన టయోటా నిలిచింది.
తొమ్మిది నెలల్లో 74.9 లక్షల విక్రయాలు
టోక్యో: ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీగా జపాన్‌కు చెందిన టయోటా నిలిచింది. ఈ కాలంలో మొత్తం 74.9 లక్షల కార్లను విక్రయించామని, దాంతో తాము విక్రయాల్లో అగ్రస్థానానికి చేరినట్లు టయోటా ప్రకటించింది. అనుబంధ కంపెనీలు దైహాత్సు, ట్రక్‌ల కంపెనీ హినో అమ్మకాలు కూడా ఇందులో ఉన్నాయి. కాగా ఇదే కాలానికి 74.3 లక్షల కార్లను విక్రయించామని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది.