నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో!

Today, tomorrow sakshi property show! - Sakshi

మాదాపూర్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  

32 నిర్మాణ సంస్థలు.. 70కి పైగా స్టాళ్ల ప్రదర్శన

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘సార్‌.. సొంతింటి ప్రయత్నం ఎంత వరకు వచ్చింది’’ .. ఈ ప్రశ్న అడగగానే చాలా మంది నోటి నుంచి వచ్చే సమాధానం.. ‘ఏం చెప్పమంటారండీ.. నా బడ్జెట్‌లో ఇల్లు దొరకడం లేదు’ అనే! ఇల్లు నచ్చితే ధర ఎక్కువని.. ఇల్లు, ధర కుదిరితే ప్రాంతం బాగోలేదని.. ఏళ్ల తరబడి సొంతింటి అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది.

మీ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు మరోసారి మీ ముందుకొచ్చింది ‘సాక్షి ప్రాపర్టీ షో’! మీ అవసరాలు, అభిరుచులు, అందుబాటు ధరల్లో  ఎలాంటి రాజీపడాల్సిన అవసరం లేకుండా నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లను మీ ముందుకు తీసుకొచ్చింది సాక్షి ప్రాపర్టీ షో.

ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ స్పాన్సర్‌గా, రాంకీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫామ్స్‌ పవర్డ్‌ బైకి వ్యవహరిస్తున్న ఈ సాక్షి ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు.. 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. పలు బ్యాంకులూ పాల్గొంటున్నాయి.

వీటిల్లో ఓపెన్‌ ప్లాట్లతో పాటూ ఫ్లాట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయల వివరాలను ప్రదర్శిస్తారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మాదాపూర్‌ హైటెక్‌ సిటీ దగ్గర్లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ షో అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి!  

మెట్రోతో జోష్‌..
మార్కెట్‌ స్థిరపడగానే అందరి ఆలోచనలు ప్రాపర్టీల చుట్టే తిరుగుతుంటాయి. ఇన్నాళ్లు మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉందని చాలామంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం నగర స్థిరాస్తి మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. తొలి దశ మెట్రో రైలు పరుగులతో నగరం చుట్టూ రియల్టీ క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో నగరంలో స్థిరాస్తి అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేశామని అన్‌రాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే వృద్ధి కనిపించిందని తెలిపింది. దీనికి తోడు త్వరలోనే మెట్రో కారిడార్‌–2ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో నగర రియల్టీలో మరింత జోష్‌ ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే..
మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్‌ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్‌ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయం.

పాల్గొనే సంస్థలివే
స్పాన్సర్‌: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌
పవర్డ్‌ బై: రాంకీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫామ్స్‌
అసోసియేట్‌ స్పాన్సర్స్‌: ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, స్పేస్‌విజన్‌ గ్రూప్‌
కో–స్పాన్సర్స్‌: సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్, మ్యాక్‌ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్‌ హోమ్స్, విర్టుసా లైఫ్‌ స్పేసెస్‌
ఇతర సంస్థలు: జనప్రియ, మంజీరా, ప్రొవిడెంట్, ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్, ఆక్యురేట్‌ డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, సిరి సంపద హోమ్స్, ఆర్వీ నిర్మాణ్, ఏఆర్కే టెర్మినస్‌ ఇన్‌ఫ్రా సాకేత్, శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్, మనస్వీ డెవలపర్స్, గ్రీన్‌ హోమ్, గ్రీన్‌మార్క్‌ డెవలపర్స్, ఫార్చూన్‌ బటర్‌ఫ్లై సిటీ, యాక్సాన్‌ హౌసింగ్‌ ఇన్‌ఫ్రా, అమృత ప్రాజెక్ట్స్, సాయిసూర్య డెవలపర్స్, శివోం ప్రాజెక్ట్స్, ఎంకే ఇన్‌ఫ్రా డెవలపర్స్, వర్ధన్‌ డెవలపర్స్, యూఎస్‌ఎం మై సిటీ, స్వర్ణ విహార్‌ ఇన్‌ఫ్రా, జెనెక్స్‌ హోమ్స్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top