నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ | today onwords narayana hridayalaya IOP | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ

Dec 17 2015 12:57 AM | Updated on Sep 3 2017 2:06 PM

నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ

నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ

నారాయణ హృదయాలయ ఐపీఓ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నదని అంచనా.

- ప్రైస్‌బాండ్  రూ.245-250 రేంజ్‌లో
 న్యూఢిల్లీ: 
నారాయణ హృదయాలయ ఐపీఓ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నదని అంచనా.  ఈ నెల 21న (వచ్చే సోమవారం) ముగిసే ఈ ఐపీఓకు రూ. 245-250 ధరల శ్రేణిని ప్రైస్‌బాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా 14 శాతం వాటాకు సమానమైన 2.45 కోట్ల షేర్లను జారీ చేస్తారు. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు సమీకరించామని  తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement