నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ | Thyrocare IPO opens on Wednesday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ

Apr 27 2016 1:38 AM | Updated on Sep 3 2017 10:49 PM

నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ

నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ

దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ చెయిన్‌ను నిర్వహిస్తున్న థైరోకేర్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది.

ధర శ్రేణి రూ.420-446
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ చెయిన్‌ను నిర్వహిస్తున్న  థైరోకేర్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 29న (శుక్రవారం) నాడు ముగిసే ఈ ఐపీఓ ద్వారా   ఒక్కోటి  రూ.10 ముఖ విలువగల  1.07 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.420-రూ.446గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ధర ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.480 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓకు ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.  థైరో కేర్ కంపెనీకి డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నస్టిక్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, అపోలో క్లినిక్‌ల నుంచి గట్టి పోటీనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement