టెక్‌ మహీంద్రలో 4వేల ఉద్యోగాలు

Tech Mahindra to increase headcount in the next 3 quarters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్ర టెకీలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాబోయే మూడు త్రైమాసికాల్లో సంస్థ ఉద్యోగులను  పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టు చెప్పింది.  దాదాపు నాలుగు వేలమంది కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించుకోవాలని చూస్తోంది. అలాగే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,800 మందిని నియమించు కున్నట్లు వెల్లడించింది.

వచ్చే తొమ్మిది నెలలకాలంలో 4వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని టెక్‌ మహీంద్ర  ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు.  జూన్‌ 2018 నాటికి కంపెనీలో 1,13,552 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు.  వీరిలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల సంఖ్య 72,462.. బీపీఓ విభాగంలో 34,700 మంది ఉద్యోగులు, సేల్స్‌లో 6,390 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్ ఆధారిత నియామకంపై మరింత దృష్టి పెట్టినట్టు  టెక్ మహీంద్ర ప్రధాన ఆర్థిక అధికారి మనోజ్ భట్  తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top