టాటా మోటార్స్‌ కార్లు ధరల మోత | Tata Motors to raise prices by up to Rs 40,000 from January 1 | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ కార్లు ధరల మోత

Dec 13 2018 5:09 PM | Updated on Jul 6 2019 3:18 PM

Tata Motors to raise prices by up to Rs 40,000 from January 1 - Sakshi

సాక్షి,ముంబై:  టాటా మోటార్స్  ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేసింది. ఈ  ధరల పెంపు జనవరి 1, 2019 నుంచి  వర్తిస్తుందని గురువారం తెలిపింది.  ప్యాసింజర్‌ వాహనాల అన్ని మోడళ్లపై దాదాపు  రూ .40 వేల వరకు పెంచినట్టు ప్రకటించింది.  మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల వ్యాపార విభాగ అధ్యక్షుడు మయాంక్ పారిక్ ఒక ప్రకటన జారీ చేశారు.

ప్యాసింజర్ వాహనాల  సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ నానో లాంటి ఎంట్రీ లెవల్‌ కారునుంచి  ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా దాకా పలు వాహనాలను విక్రయిస్తోంది.  వీటి ధరలు రూ .2.36 లక్షలు, రూ. 17.97 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  మధ్య ఉన్నాయి.

కాగా జనవరి నెలలో సంస్థ తన కొత్త ప్రీమియం ఎస్‌యూవీ  హారియర్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement