టాటా మోటార్స్ కార్ల ధ‌ర‌ల పెంపు

Tata Motors to hike PV prices by up to Rs 60,000 from April 1 - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌  కార్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  మారుతున్న మార్కెట్ పరిస్థితులు సహా ఇతర వివిధ ఆర్థిక కారణాల రీత్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.   సవరించిన ఈ ధరలు  ఏప్రిల్‌ 1నుంచి  అమల్లోకి వస్తాయని తెలిపింది.

పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, వివ ిధ బాహ్య ఆర్థిక కారకాలు ధరల పెంపునకు ఒత్తిడి చేశాయని టాటా మోటార్స్  ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్‌ చెప్పారు.రూ.2.28లక్షల మొదలయ్యే ప్యాసింజర్ కారు జెన్‌ ఎక్స్‌ నానో నుంచి రూ.1742 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా  వాహనాలను విక్రయిస్తుంది. గత వారం జర్మనీ కార్‌ మేకర్‌ ఆడి  కార్ల ధరల పెంపును ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top