సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్ | Sun Pharma board approves buyback of shares at Rs900 | Sakshi
Sakshi News home page

సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్

Jun 24 2016 1:17 AM | Updated on Sep 4 2017 3:13 AM

సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్

సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్

సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నది. గురువారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది

ఒక్కో షేర్‌కు రూ.900 బై బ్యాక్ ఆఫర్

 ముంబై: సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన  షేర్లను బై బ్యాక్ చేయనున్నది.  గురువారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్ల ను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది.  ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించామని తెలిపింది. సన్ ఫార్మా,...ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద స్పెషాల్టీ జనరిక్ ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ ఉత్పత్తులు 150 కు పైగా దేశాల్లో లభిస్తాయి. గత ఆర్థిక సంవత్సం చివరినాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.35,400 కోట్లుకా గా, రిజర్వ్‌లు నగదు నిల్వలు రూ.31,100 కోట్లుగా, మొత్తం రుణ భారం రూ.9,750 కోట్లుగా ఉంది. ఈ బై బ్యాక్ వార్తలతో బీఎస్‌ఈలో  కంపెనీ షేర్ ఇంట్రాడేలో 2% వరకూ ఎగసింది. చివరకు 1.5% లాభంతో రూ.752 వద్ద  ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement