స్టాక్స్‌ వ్యూ

Stock view in this week - Sakshi

అర్‌వింద్‌  ఫ్యాషన్స్‌

బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌

ప్రస్తుత ధర: రూ.1,047        
టార్గెట్‌ ధర:  రూ.1,358

ఎందుకంటే: అర్‌వింద్‌ కంపెనీ నుంచి విడివడి(డీమెర్జ్‌) అయి ఇటీవలనే స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. బ్రాండెడ్‌ దుస్తుల కంపెనీల్లో అగ్రస్థాయి కంపెనీల్లో ఇదొకటి. వేర్వేరు ఆదాయ వర్గాల అవసరాలకు తగ్గట్లుగా వివిధ రేంజ్‌ల్లో  దుస్తులను అందిస్తోంది. యూఎస్‌ పోలో, టామీ హిల్‌ఫిగర్, యారో, ఫ్లయింగ్‌ మెషీన్, కాల్విన్‌ క్లెయిన్, గ్యాప్‌ తదితర బ్రాండ్ల దుస్తులను అందిస్తోంది. 1,300కు పైగా రిటైల్‌ స్టోర్స్, 1,400కు పైగా డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్, 1,800కు పైగా మల్టీ బ్రాండ్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా తన దుస్తులను విక్రయిస్తోంది. అన్‌ లిమిటెడ్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహిస్తోంది. జీఎస్‌టీ అమలు తర్వాత బ్రాండెడ్‌ దుస్తులకు గిరాకీ పెరిగింది. 2016–2018 మధ్య కాలంలో ఈ కంపెనీ ఆదాయం 26 శాతం, నిర్వహణ లాభం 38% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. ఇక రానున్న రెండేళ్లలో ఆదాయం 16 శాతం, నిర్వహణ లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2017లో రుణాత్మకంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 2021 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతానికి, ఆర్‌ఓసీఈ 3 శాతం నుంచి 8.2 శాతానికి పెరుగుతాయని  అంచనా వేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతంగా ఉన్న రుణ–ఈక్విటీ నిష్పత్తి 2020–21 ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నాం. మరిన్ని రిటైల్‌ స్టోర్స్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు తన సొంత వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అరవింద్‌ కంపెనీ నుంచి విభజన(డీమెర్జ్‌) అయి ఈ కంపెనీ ఫెయిర్‌ వేల్యూ కంటే చాలా తక్కువ ధరకే రూ.592కే స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. లిస్టైన అనతి కాలంలోనే రూ. వెయ్యికి చేరుకుంది.  క్వాలిటీ రిటైల్‌ షేర్‌ ఆకర్షణీయ ధరలో లభిస్తోంది.

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌
బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌
ప్రస్తుత ధర:   రూ.1,684      
 టార్గెట్‌ ధర: రూ.1,950

ఎందుకంటే: భారత దేశ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) అనుబంధ కంపెనీ ఇది. భారత్‌లో అతి పెద్ద ఆరో ఐటీ కంపెనీ ఇది. 1996లో ఆరంభమైన ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రస్తుతం 27 దేశాలకు విస్తరించాయి. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 63 కంపెనీలకు తన సర్వీసులను అందిస్తోంది.  2016–18 మధ్య  కంపెనీ ఆదాయం 13%, నికర లాభం 15% చొప్పున చక్రగతిన వృద్ధి సా«ధించాయి. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కంపెనీ కీలక వృద్ధి అంశం. ఏడాది కాలంలో కంపెనీ 21% వృద్ధిని సాధిస్తే,  ఒక్క డిజిటల్‌ విభాగమే 40% మేర వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో రానున్న ఏడాది కాలంలో ఈ కంపెనీ డిజిటల్‌ విభాగం 25 శాతం మేర వృద్ధి సాధించగలదన్న అంచనాలున్నాయి. మొత్తం మీద రెండేళ్లలో ఈ విభాగం ఆదాయం 33 శాతం చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. మిడ్‌సైజ్‌ ఐటీ కంపెనీల విభాగంలో ఈ కంపెనీ ఎబిటా మార్జిన్లే ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎబిటా మార్జిన్లు మైండ్‌ ట్రీకి 14–16 శాతంగా, ఎన్‌ఐఐటీ టెక్‌కు 16–19%, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌కు 15–20% ఉండగా, ఈ కంపెనీ ఎబిటా మార్జిన్లు 19–21 శాతం రేంజ్‌లో ఉన్నాయి. ఎబిటా మార్జిన్ల విషయంలో కనీసం రెండేళ్ల వరకూ ఇదే జోరు కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 17%, ఎబిటా మార్జిన్లు 19%. నికర లాభం 15%  చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌(ఆర్‌ఓసీఈ) 34 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top