స్కోడా కార్లపై భారీ తగ్గింపు

Skoda Cars Available With Benefits Of Upto Rs 1.75 Lakh - Sakshi

వివిధ మోడళ్ల  స్కోడా కార్లపై  భారీ తగ్గింపు

సూపర్బ్‌ మై -2018  కారుపై  రూ .1.75 లక్షల డిస్కౌంట్‌

మే 31 వరకు మాత్రమే అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ:  కారును సొంతం చేసుకోవాలని కలలు కంటున్నవారికి సువర్ణావకాశం. డ్రీమ్‌ కార్‌ను సొంతం చేసుకునే సమయం ఇది. తొలకరి జల్లుల కంటే ముందే  ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివిధ లగ్జరీ మోడళ్ల కార్ల కొనుగోళ్లపై నగదు డిస్కౌంట్, లాయల్టీ బోనస్, క్యాష్‌బ్యాక్‌ , బై బ్యాక్‌ లాంటి అద్భుతమైన ఆఫర్లను  అందిస్తోంది. రాపిడ్‌, ఆక్టావియా,  కొడియాక్ తదితర కార్లపై  దాదాపు రూ.1. 75 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.  అవకాశం మే 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

నగదు లాభాలు, లాయల్టీ బోనస్ ఇతర ప్రయోజనాలు

రాపిడ్ ( ఆంబిషన్‌ ఎంటీ డీజిల్‌,  ఆంబిషన్‌ ఏటీ పెట్రోల్‌, స్టైల్‌ ఎంటీ ప్రెటోలు తప్ప) రూ. 50వేల వరకు  డిస్కౌంట్‌ , దీంతోపాటు రూ .25వే లాయల్టీ బోనస్‌
ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు

ఆంబిషన్‌ ఎంటీ డీజిల్‌ ఆంబిషన్‌ ఏటీ, పెట్రోల్‌, స్టైల్‌ ఎంటీ ప్రెటోల్‌ మోడల్స్‌ పై రూ. 25వేల లాయల్టీ బోనస్‌
ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు

రాపిడ్ మై 2018  రూ .1 లక్ష వరకు  డిస్కౌంట్‌,  దీంతోపాటు 10వేల రూపాయల మెయింటినెన్స్‌ ప్యాకేజీ కూడా లభ్యం. 

ఆక్టావియా రూ. 50వేల వరకు  డిస్కౌంట్‌  (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) మరో రూ .50వేల  లోయల్టీ బోనస్‌

సూపర్బ్‌ మై 2019 రూ .50వేల డిస్కౌంట్‌ వరకు (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) 3 సంవత్సరాల తర్వాత 57 శాతం  బై బ్యాక్ ఆఫర్‌

సూపర్బ్‌ మై -2018  కారుపై  రూ .1.75 లక్షల డిస్కౌంట్‌

కోడియాక్ రూ .50వేల డిస్కౌంట్‌ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) రూ .50వేల లోయల్టీ బోనస్‌.

ఈ  ఆఫర్లు భారతదేశం అంతటా వర్తిస్తాయి.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top