
స్కోడా కంపెనీ భారతదేశంలో.. ఆక్టావియా ఆర్ఎస్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. దీనిని సంస్థ కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచే మొదలైపోయాయి. ఈ కారు ధర రూ. 49.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
స్కోడా తన ఆక్టావియా ఆర్ఎస్ కారును లాంచ్ చేయడానికి ముందే.. అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుంటారు. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువ. ఇది ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 13 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదనపు అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.
ఇదీ చదవండి: ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్‌లో..
2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 261 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్‌మిషన్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్‌కు డెలివరీ చేస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం.