శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్‌కమ్ | Shriram Life launches assured income plan | Sakshi
Sakshi News home page

శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్‌కమ్

Dec 9 2014 12:44 AM | Updated on Sep 2 2017 5:50 PM

శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్‌కమ్

శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్‌కమ్

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘అష్యూర్డ్ ఇన్‌కమ్ ప్లాన్’ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘అష్యూర్డ్ ఇన్‌కమ్ ప్లాన్’ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాత ఒకేసారిగా లేదా ఏటా కొంత మొత్తం చొప్పున గ్యారంటీ ఇన్‌కమ్ అందుకునే విధంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఇది ఒక విధంగా పెన్షన్ ప్లాన్ కింద పని చేసేదే అయినా... 30 ఏళ్లు దాటిన వారికి కూడా ఏటా హామీతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చన్నారు.

పాలసీకి 8 లేదా 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన వార్షిక ప్రీమియానికి గరిష్టంగా 10 రెట్లు బీమా రక్షణ లభిస్తుంది. ఈ పాలసీని 30 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 50 ఏళ్ల వారి వరకు తీసుకోవచ్చు. వచ్చే మూడు నెలల కాలంలో 10,000 అష్యూర్డ్ ఇన్‌కమ్ ప్లాన్స్‌ను విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల ప్రీమియం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement