దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు

Sensex Surges Over 450 Points Nifty Hits  Hit AllTime High - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో   రేసు గుర్రాల్లా దూసుకుపోతున్నాయి.  ఈ ఏడాది వర్షపాతం 96శాతం  సాధారణ సగటును అందుకోవచ‍్చన్న వాతావరణ శాఖ వేసిన అంచనాలు  కీలక సూచీలకు  బూస్ట్‌ ఇస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ సరికొత్త రికార్డులను అధిగమించి ఉత్సాహంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ గత గరిష్ట రికార్డ్‌ 11,761ను అధిగమించి 11800 స్థాయిని తాకింది. అటు సెన్సెక్స్‌ సైతం 450 పాయింట్లు జంప్‌ చేసింది. ప్రస్తుతం  39,325వద్ద కొనసాగుతోంది.  అటు బ్యాంకింగ్‌ సెక్టార్‌లో కొనుగోళ్లతో బ్యాంక్‌ నిఫ్టీ కూడా రికార్డు స్థాయిల్లో కొనసాగుతోంది. 

రియల్టీ మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే కొనసాగుతున్నాయి  ఐసీఐసీఐ, టైటన్‌, ఇండస్‌ఇండ్, ఏషియన్‌ పెయింట్స్‌, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, ఇన్ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, మారుతీ 3-1.5 శాతం మధ్య ఎగశాయి.  ఆరంభంలో నష్టపోయిన టాటా మోటార్స్‌ కూడా మిడ్‌  సెషన్‌ తరువాత లాభాల్లోకి మళ్లింది.  సిప్లా, ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌ నష్టపోతున్నాయి.  రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, సన్‌టెక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్ 3-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

మరోవైపు మూత పడనుందన్న వార్తలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 18శాతం పతనమైంది. అటు  ఇండిగో 54 వారాల  గరిష్టం వద్ద ఉంది. స్సైస్‌ జెట్‌ కూడా భారీ లాభాలతో కొనసాగుతోంది.  కాగా  రేపు బుధవారం మార్కెట్లకు సెలవు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top