కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు  | Sensex Gains Over 150 Points Nifty Crosses 11 600 Mark | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

Jul 16 2019 10:35 AM | Updated on Jul 16 2019 10:56 AM

Sensex Gains Over 150 Points Nifty Crosses 11 600 Mark - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ఫ్లాట్‌ ప్రారంభంనుంచి హెచ్చుతగ్గుల మధ్య కదులుతూ  ఉన్నట్టుండి జోరందుకున్నాయి. కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 150 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ సైతం 30 పాయింట్లు పుంజుకుని 11,618 వద్ద ట్రేడవుతోంది. అయితే హైయ్యర్‌ లెవల్స్‌ వద్ద  తిరిగి అమ్మకాల  ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్‌ ప్రస్తుతం 73 పాయింట్ల లాభాలకు పరిమితమైంది.  మరోవైపు సోమవారం వరుసగా నాలుగో రోజు అమెరికా  మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. 

మెటల్‌, బ్యాంక్స్‌, రియల్టీ  పాజిటివ్‌గా ఐటీస్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. టాటా మోటార్స్‌, వేదాంతా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, సిప్లా లాభాల్లో, టీసీఎస్‌, ఐబీ హౌసింగ్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, హీరో మోటో, ఇండస్‌ఇండ్‌ నష్టాలతో సాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement