నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ | Sensex down due to selling by funds and retail investors | Sakshi
Sakshi News home page

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Jul 30 2014 1:42 PM | Updated on Oct 4 2018 5:15 PM

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ - Sakshi

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

కార్పోరేట్ ఫలితాల్లో ప్రతికూలత, విదేశీ, దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం మధ్యాహ్నం సమయానికి నష్టాల్లో జారుకున్నాయి

హైదరాబాద్: కార్పోరేట్ ఫలితాల్లో ప్రతికూలత, విదేశీ, దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం మధ్యాహ్నం సమయానికి నష్టాల్లో జారుకున్నాయి. సెన్సెక్స్  117 పాయింట్ల నష్టంతో 25891 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల క్షీణించి 7719 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
 
భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 4.58 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, లుపిన్, గెయిల్, డీఎల్ఎఫ్ సుమారు 2 శాతం లాభపడి.. సూచీలకు మద్దతుగా నిలిచాయి. 
 
లార్సెన్ అత్యధికంగా 7.34 శాతం క్షీణించగా, జిందాల్ స్టీల్, సెసా స్టెర్ లైట్, టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement