చందా కొచర్‌కు సెబీ నోటీసులు

SEBI notice to ICICI Bank, CEO Kochhar - Sakshi

ముంబై: వీడియోకాన్‌ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవో చందా కొచర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. ఈ లావాదేవీల వివరాలను వెల్లడించే విషయంలో లిస్టింగ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఇందులో పేర్కొంది.

చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేలా ఈ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెబీ నోటీసులకు తగు వివరణ ఇవ్వనున్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ రుణం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది.

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం పొందిన వీడియోకాన్‌ గ్రూప్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌... దీపక్‌ కొచర్‌కి చెందిన న్యూపవర్‌ రెన్యువబుల్స్‌లో రూ. 64 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచర్‌ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ లావాదేవీలు క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ జరుపుతోంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top