స్కూటర్ల అమ్మకాల్లో వృద్ధి 40 శాతం | Scooters sales up 40 percent | Sakshi
Sakshi News home page

స్కూటర్ల అమ్మకాల్లో వృద్ధి 40 శాతం

Sep 21 2017 12:57 AM | Updated on Sep 22 2017 6:36 PM

స్కూటర్ల అమ్మకాల్లో వృద్ధి 40 శాతం

స్కూటర్ల అమ్మకాల్లో వృద్ధి 40 శాతం

దేశంలో ఆటోమొబైల్స్‌ రంగంలో స్కూటర్‌ మార్కెట్‌ శరవేగంగా దూసుకెళ్తోందని యమహా మోటార్స్‌ ఇండియా సేల్స్‌ ప్రైవేట్‌ ....

చెన్నై ప్లాంట్‌ ద్వారా 9 లక్షల స్కూటర్ల తయారీ లక్ష్యం
యమహా ఇండియా సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాయ్‌ కురియన్‌


విశాఖ సిటీ: దేశంలో ఆటోమొబైల్స్‌ రంగంలో స్కూటర్‌ మార్కెట్‌ శరవేగంగా దూసుకెళ్తోందని యమహా మోటార్స్‌ ఇండియా సేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాయ్‌ కురియన్‌ అన్నారు. రానున్న రెండేళ్లలో స్కూటర్ల అమ్మకాల్లో 40% వృద్ధి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో రెండో స్కూటర్‌ బొటిక్‌ను విశాఖపట్నంలో కురియన్‌తోపాటు యమహా మోటార్‌ ఇండియా సేల్స్‌ ఎండీ మసాకీ అసానో కలిసి ప్రారంభించారు. దేశంలో స్కూటర్‌ కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయని. ప్రతి 100 ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 40 స్కూట ర్లేనని కురియన్‌ చెప్పారు. చెన్నై ప్లాంట్‌ ద్వారా ఏడాదికి 6 లక్షల వాహనాలు ఉత్పత్తి చేస్తున్నామనీ.. వచ్చే ఏడాది 9 లక్షల ఉత్పత్తి చెయ్యడమే లక్ష్యమని కురియన్‌ చెప్పారు.

స్కూటర్‌ ఓ ఫ్యాషన్‌గా భావిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు మరింత ఫ్యాషన్‌గా కనిపించేందుకు అవసరమైన వస్తువుల్ని అందించేందుకే స్కూటర్‌ బొటిక్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామన్నారు. ఇండియాలోనే మొదటిసారిగా చెన్నైలోనూ, రెండో బొటిక్‌ వైజాగ్‌లో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో త్వరలో మరో స్కూటర్‌ బొటిక్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement